Human Ear Replica | న్యూయార్క్, మార్చి 30: అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్, కార్నెల్ ఇంజినీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. అమెరికా శాస్త్రవేత్తలు టిష్యూ ఇంజినీరింగ్, 3డీ ప్రింటింగ్ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి, తర్వాతి కాలంలో చెవి కోల్పోయిన వారికి దీనిని అమర్చవచ్చని వెయిల్ కార్నెల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ జాసోన్ స్పెక్టర్ తెలిపారు.