న్యూయార్క్: కాలేయ సంబంధ అలగిలె సిండ్రోమ్‌ను నయం చేసే మందును అమెరికాలోని యూఎస్‌లోని సాన్ఫర్డ్ బర్న్‌హామ్ మెడికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనిపెట్టారు. దీనికి ‘ఎన్ఓఆర్ఏ1’ అని నామకరణం చేశారు. ఈ డ్రగ్ కణానికి కణానికి మధ్య సిగ్నలింగ్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుందని, అలగిలె సిండ్రోమ్తోపాటు అనేక వ్యాధులను తగ్గిస్తుందని డ్రగ్‌ను కనిపెట్టిన బృందానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డక్ డాంగ్ తెలిపారు. ఈ సిండ్రోమ్‌ను తగ్గించే డ్రగ్ ఇదే మొదటిదని వెల్లడించారు. దీన్ని త్వరలోని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.