Chicken or Egg | లండన్, జూన్ 16: కోడి ముందా? గుడ్డు ముందా?.. ఈ చిక్కు ప్రశ్నకు పరిశోధకులు సమాధానం కనుగొన్నారు. కోడే ముందని శాస్త్రీయంగా తేల్చారు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇప్పుడున్న రూపం సంతరించుకోక ముందు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చాయని తేల్చారు. 51 శిలాజ జాతులు, 29 జీవజాతులను గుడ్లు పెట్టేవి.. పిల్లలను కనేవి అనే రెండు క్యాటగిరీలుగా విభజించి బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవని గుర్తించారు. ఈ క్రమంలోనే పరిస్థితులు అనువుగా మారేవరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకొనేవని కనుగొన్నారు.