Konda Surekha : మంత్రివర్గం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బర్తరఫ్‌ను గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఆమోదించారు. క్యాబినెట్ మినిస్టర్‌గా సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపిన కొండా సురేఖ కుమార్తె, కొండా సుస్మిత వ్యాఖ్యలు చివరకు బర్తరఫ్కు దారి తీసిన విషయం తెలిసిందే. సురేఖపై వేటు ఊహించిన పరిణామమే కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సలహా మేరకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా వెంటనే ఆమోదం తెలిపారు.
కొండా సురేఖను మంత్రి వర్గం నుండి తొలగింపు నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్ https://t.co/0HGwLm7Aeq pic.twitter.com/WrYispW8eg
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి సలహా మేరకు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్న దస్త్రాన్ని గవర్నర్ ఆమోదించారు. లోక్ భవన్ ప్రకటనగా ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మీడియాతో పంచుకున్నారు. దాంతో,సెప్టెంబర్ 3.. ఈరోజుతో సురేఖ మంత్రి పదవి ఊడింది. ఆమె ఇకపై కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగనున్నారు. గత ఎన్నికల్లో సురేఖ వరంగల్ తూర్పు నుంచి శాసన సభ్యురాలిగా గెలుపొందారు.