Oldest Forest | న్యూఢిల్లీ, జనవరి 13: ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారు. న్యూయార్క్‌లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పేర్కొన్నారు. అక్కడ సేకరించిన రాళ్లపై పరిశోధనల ఆధారంగా ఆ అడవి దాదాపు 38.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని ప్రాథమికంగా వెల్లడించారు.
పురాతన అడవి ఉనికి పరిశోధక బృందానికి ఇంతకుముందు తెలిసినప్పటికీ, ఆ ప్రదేశంలో వృద్ధి చెందుతున్న మొక్కలు, చెట్ల వయసును గుర్తించేందుకు సమగ్ర పరిశోధనకు ఇది మొదటి ఉదాహరణ అని బీబీసీ పేర్కొన్నది. ఈ రాళ్లలో ఉన్న శిలాజ మూలాలు గతం గురించి పూర్తి అవగాహనను కల్పిస్తాయని, ఇది దాదాపు 400 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న పురాతన అడవిని సూచిస్తాయని పరిశోధకులు తెలిపారు.