బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 10:16:58

ట‌ర్కీలో 10వేల మంది ఖైదీల విడుద‌ల‌కు రంగం సిద్దం

ట‌ర్కీలో 10వేల మంది  ఖైదీల విడుద‌ల‌కు రంగం సిద్దం

అంకార‌: క‌రోనా ఎఫెక్ట్‌తో ట‌ర్కీలో ఖైదీల విడుద‌ల‌కు ఆ దేశం రంగం సిద్దం చేస్తోంది. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు త‌క్ష‌ణం పదివేల మంది ఖైదీలను విడుదల చేయాలనీ టర్కీ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రవేశపెట్టిన బిల్లుకు, దాదాపుగా అన్ని ప‌క్షాలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. అక్క‌డి పార్ల‌మెంట్‌లో మెజారిటీ స‌భ్యులు అనుకూలంగా రావడంతో ఈ బిల్లుకు ఆమోద‌ముద్ర వేశారు.  సుమారు 45,000 మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. అర్హత ఉన్నవారు మే నెల చివరి వరకు న్యాయ నియంత్రణలో విడుదల అవుతారని అక్క‌డి అధికారులు తెలిపారు. కాగా న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.


logo