న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. 2021 జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వద్దా అని పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
24 గంటల్లోగా అభిప్రాయాన్ని వెల్లడించాలంటూ మస్క్ తన పోల్ ట్వీట్లో కోరారు. అయితే ఇప్పటికే 20 లక్షల మంది ఆ ఓటింగ్‌లో పాల్గొన్నారు. దాంట్లో 60 శాతం మంది ట్రంప్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా పోలింగ్ ముగిసేందుకు 22 గంటల సమయం ఉంది. మరో వైపు మస్క్ వార్నింగ్‌తో ట్విట్టర్‌ను వీడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
రాజీనామాల గురించి తానేమీ బాధపడడం లేదని, ఉత్తమ ఉద్యోగులు సంస్థలోనే ఉంటున్నారని మస్క్ అన్నారు.