గురువారం 09 జూలై 2020
International - Jun 29, 2020 , 01:32:11

ప్రజల సహకారం వల్లే కరోనా కట్టడి

ప్రజల సహకారం వల్లే కరోనా కట్టడి

వాషింగ్టన్‌: భారతదేశంలో కరోనాపై పోరును ప్రజలే ముందుండి నడిపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కట్టడిలో ఇండియా మెరుగ్గా ఉందన్నారు. ప్రజల సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పారు. ఆదివారం ఆయన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(ఏఏపీఐ) ప్రతినిధులతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశాలు స్వావలంబన సాధించడానికి, ఆరోగ్యపరంగా మరింత అభివృద్ధి చెందడానికి కరోనాను ఒక అవకాశంగా భావించాలన్నారు. ఇండియాలో మరణాల శాతం బాగా తక్కువగా ఉందని చెప్పారు.కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందిలో 350 మంది చనిపోతున్నారని తెలిపారు. ఈ సంఖ్య అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో 600గా ఉండగా.. ఇండియాలో మాత్రం 12 మాత్రమే అని తెలిపారు. 


logo