కాఠ్మాండూ : నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి శ్రీరాముని జన్మ స్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి మహర్షి రాసిన అసలైన రామాయణం ప్రకారం, శ్రీరాముడు, శివుడు, విశ్వామిత్రుడు నేపాల్ గడ్డపైనే జన్మించారని చెప్పారు. సీపీఎన్-యూఎంఎల్‌కు చెందిన పర్యాటక, పౌర విమానయాన శాఖ కాఠ్మాండూలో నిర్వహించిన కార్యక్రమంలో ఓలీ మాట్లాడుతూ, ‘రాముడు నేటి నేపాలీ భూభాగంలోనే జన్మించాడు.
అప్పట్లో దానిని నేపాల్ అని పిలిచి ఉండవచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. ఆ ప్రాంతం నేటి నేపాల్‌లోనే ఉంది’ అని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్‌లోనే జన్మించారని, ఈ విషయాన్ని తాను కల్పించి చెప్పడం లేదని, వాల్మీకి రామాయణమే చెప్తున్నదన్నారు.