దుబాయ్, జూన్ 16: స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్న కారణంతో రెయిన్బో కలర్ బొమ్మలను సౌదీ అరేబియా అధికారులు సీజ్ చేస్తున్నారు. పిల్లల కోసం తయారు చేసిన ఈ బొమ్మలు, స్కర్ట్లు, టోపీలు ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏమీ తెలియని పిల్లలకు విషపూరితమైన సందేశాన్ని ఈ కలర్ బొమ్మల ద్వారా నూరిపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వీటిని సీజ్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు చెప్పారు.