డబ్లిన్: ఐర్లాండ్‌లో జాత్యహంకార దాడి(Racial Attack) ఘటన జరిగింది. భారత్‌కు చెందిన ఓ ఔత్సాహిక వ్యాపారిపై అటాక్ జరిగింది. డబ్లిన్‌లో కొందరు టీనేజర్లు అతన్ని తీవ్రంగా కొట్టారు. సంతోష్ యాదవ్ అనే వ్యక్తి అక్కడ సీనియర్ డేటా అనలిస్టుగా పనిచేస్తున్నాడు. లెట్టర్‌కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. దాడి గురించి అతను తన లింక్డిన్ ప్రొఫైల్‌లో పోస్టు చేశాడు. తల, ముఖం, మెడ, ఛాతి, చేతులు, కాళ్లపై యువకులు దాడి చేసినట్లు పేర్కొన్నాడు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఘటన గురించి చాలా సుదీర్ఘమైన పోస్టు చేశాడతను.
భారతీయ సంతతి వ్యక్తులపై ఐర్లాండ్‌లో దాడులు పెరుగుతున్నట్లు అతను పేర్కొన్నాడు. డిన్నర్ చేసిన తర్వాత తన అపార్ట్మెంట్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు అటాక్ చేసినట్లు పేర్కొన్నాడు. తన కంటి అద్దాలను తీసివేసి.. నిర్దాక్షిణ్యంగా తల, మెడపై దాడి చేశారన్నారు. రోడ్డుపైనే రక్తం కారుతున్న దశలో తనను వదిలేశారన్నాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేశానని, వాళ్లు ఆస్పత్రిలో చేర్పించారన్నాడు. తన దవడ ఎముక విరిగినట్లు మెడికల్ బృందం పేర్కొన్నట్లు తన పోస్టులో తెలిపారు.
కొన్ని రోజుల క్రితం డబ్లిన్లోనే ఓ భారతీయుడిపై అటాక్ జరిగింది. చిన్న పిల్లలతో సరైన రీతిలో ప్రవర్తించలేదన్న నెపంతో కొందరు అతన్ని అటాక్ చేసిన విషయం తెలిసిందే.