Queen Elizabeth Death |గురువారం స్కాట్లాండ్ బాల్మోరల్ కోటలో కన్నుమూసిన ఎలిజబెత్ రాణి-2.. బ్రిటన్ను సుదీర్ఘకాలం పరిపాలించారు. ఎలిజబెత్ రాణి-2 బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధికంగా 70 ఏండ్లు పాలన సాగించారు. రాణిగా ఎలిజబెత్ రాణి-2 70 ఏండ్ల పాలనకు గుర్తుగా గత జూన్లో క్వీన్ ప్లాటినం జుబ్లీ వేడుకలు నిర్వహించింది బ్రిటన్ ప్రభుత్వం.
2015లో విక్టోరియా మహారాణి తర్వాత అత్యధిక కాలం బ్రిటన్ రాణిగా పాలన సాగించిన రికార్డు నెలకొల్పారు క్వీన్ ఎలిజబెత్. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలనలో ఉన్న రెండో రాణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 70 ఏండ్ల ప్లాటినం జుబ్లీ ఉత్సవాల నిర్వహణ పట్ల ఎలిజబెత్ రాణి.. యావత్ జాతికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవాలు తన హృదయాన్ని తాకాయని పేర్కొన్నారు.
`మీ 70 ఏండ్ల రాణి పాలనకు గుర్తుగా ఉత్సవాలు ఎలా జరుపుకోవాలన్న విషయమై ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఇవి దేశ చరిత్రలోనే తొలిసారి` అని ఎలిజబెత్-2 తెలిపారు.