అలస్కా: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. రెండు రోజుల క్రితం అలస్కాలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై వాళ్లు చర్చించారు. అయితే అలస్కా ట్రిప్ కోసం పుతిన్ బాడీగార్డులు .. మలసేకరణ సూట్‌కేసులను తీసుకెళ్లినట్లు సమాచారం ద్వారా తెలిసింది. దీనిపై కొన్ని మీడియా సంస్థలు కథనాన్ని రాశాయి. శుక్రవారం జరిగిన అలస్కా మీటింగ్ కోసం పుతిన్ బాడీగార్డులు .. పూప్ సూట్‌కేసులతో వెళ్లినట్లు ఆ కథనంలో చెప్పారు. అయితే పుతిన్ ఆరోగ్య సమాచారం విదేశీ శక్తులకు తెలియవద్దు అన్న ఉద్దేశంతో ఆ సూట్‌కేసులు తీసుకెళ్లారు. ఒవవేళ పుతిన్ మల, మూత్రాలు విసర్జిస్తే, వాటిని ప్రత్యేక బ్యాగుల్లో సేకరిస్తారు. ఆ బ్యాగ్‌లను సూట్‌కేసుల్లో పెట్టి మళ్లీ రష్యాకు తీసుకెళ్తారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి.
అలస్కా పర్యటన సమయంలో ప్రత్యేక బలగాలు పుతిన్‌కు భద్రత కల్పించాయి. ఆ టూర్ మొత్తం బాడీగార్డులు ఆయన్ను చుట్టుముట్టి ఉన్నారు. రష్యా అధ్యక్షుడికి చెందిన ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్(ఎఫ్‌పీఎస్) సాధారణంగా మల, మూత్రం సేకరిస్తుంది. 2017లో పుతిన్ ఫ్రాన్స్ టూరుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన మలమూత్రాన్ని సపరేటు బ్యాగుల్లో సేకరించారు. వియన్నా విజిట్ సమయంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ సమయంలో ఆయన పోర్టబుల్ టాయిలెట్ వాడారు. 1999లో రష్యా అధినేతగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పుతిన్‌కు 72 ఏళ్లు. అయితే ఆయన ఆరోగ్యంపై ఇటీవల విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యం సరిగా లేదని పుకార్లు పుడుతున్నాయి. కజకస్తాన్‌లోని ఆస్తానాలో ఆయన కాళ్లు ఇబ్బందికరంగా కనిపించాయి. బహుశా పుతిన్‌కు పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు అంచనా వేశారు. బెలారస్ అధ్యక్షుడిని కలిసిన సమయంలోనూ పుతిన్ కొంత ఇబ్బందిపడ్డాడు. రష్యా అధ్యక్ష కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.