మాస్కో, మార్చి 16: కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనిక బలగాలు తమకు లొంగిపోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం హెచ్చరించారు. అలా చేస్తే వారికి భద్రత కల్పిస్తామని, మానవతతో వ్యవహరిస్తామని ఆయన వాగ్దానం చేశారు.
ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని ట్రంప్ కోరిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారు కనుక ఆయుధాలు వదిలి లొంగిపోతే, వారి ప్రాణాలు నిలుస్తాయి. వారికి గౌరవప్రదమైన మర్యాద దక్కుతుంది’ అని అన్నారు. అయితే తమ బలగాలను చుట్టుముట్టారంటూ వస్తున్న వార్తలను ఉక్రెయిన్ మిలిటరీ తిరస్కరించింది