Elon Musk to Putin | ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్పేస్ ఎక్స్-టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ మరో సవాల్ విసిరారు. తనతో పోరాడేందుకు పుతిన్ తన సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకోవచ్చునన్నారు. ఇంతకుముందు పుతిన్‌తో పోరాడుతానంటూ ఎలన్‌మస్క్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఇప్పటికే ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌తో ముఖాముఖీ పోరాటానికి సవాల్ విసురుతున్నా.. ఈ పోరులో గెలిచే వారే ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగాలా? వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తారని సోమవారం ట్వీట్ చేశారు.
దీనిపై రష్యా స్పేస్ సంస్థ అధిపతి డిమిట్రీ రొగోజిన్ రియాక్టయ్యారు. నువ్వో చిన్న దయ్యానివి. ఇంకా కుర్రాడిననుకుంటున్నావా.. బలహీనుడా.. నాతో పోటీ పడు.. అయినా అదీ సమయం వృథాయే.. ముందు నా తమ్ముడితో గెలువు అని ఎలన్‌మస్క్‌ను ఎద్దేవా చేశారు.
డిమిట్రీ రొగోజిన్ వ్యాఖ్యలపై ఎలన్‌మస్క్ ప్రతి స్పందించారు. ఎలుగుబంటిపై రైడ్ చేస్తున్న ఫొటో, దాని పక్కనే తాను మంటలు రేపుతున్న ఫొటో జత చేసి పోస్ట్ చేశారు. అలా తనతో పోరాటానికి పుతిన్ ఆయన సొంత ఎలుగుబంటిని తెచ్చుకోవచ్చన్న సంకేతాలిచ్చారు.