మాస్కో: ఉక్రెయిన్ బోర్డర్ వద్ద ఉన్న కుర్స్క్ ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పర్యటించారు. ఆ ట్రిప్ చేపట్టిన సమయంలో పుతిన్ మిలిటరీ దుస్తుల్లో కనిపించారు. ఫ్రంట్లైన్లో ఆయన ఆ దుస్తులతో వెళ్లడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న కుర్క్క్ ప్రాంతంలో పుతిన్ ఉన్నట్లు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కుర్స్క్ లో పర్యటించిన పుతిన్ ధైర్యసాహాసాలను నిపుణులు మెచ్చుకున్నారు. చాలా ప్రమాదకరమైన ప్రాంతంలో ఆయన పర్యటించినట్లు కొందరు పేర్కొన్నారు. మరో వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలుమార్లు ఫ్రంట్లైన్లో టూర్ చేశారు.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ పాటించేందుకు జెలెన్స్కీ అంగీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు నిర్వహించిన మీటింగ్లో ఆ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని పుతిన్ అంగీకరిస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు పుతిన్ సిద్ధంగా లేరని, అందుకే ఆయన మిలిటరీ దుస్తుల్లో కనిపించారని కొందరంటున్నారు.
కుర్స్క్ ప్రాంతంలో సుజా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధికారులు చెప్పారు. ఈ పట్టణాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నది. చాన్నాళ్ల తర్వాత మిలిటరీ దుస్తుల్లో కనిపించిన పుతిన్ చాలా హుషారుగా ఉన్నారు. కుర్స్క్ ప్రాంతంలో ఉన్న శుత్రవుల్ని తుదముట్టించాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఉక్రెయిన్లోని డోనస్కీ ప్రాంతంలో తాజాగా రష్యా జరిపిన దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు.
For the first time in three years of war, Putin appears in army uniform. While Trump talks about peace, Putin signals preparations for a new war. His visit to Kursk in military dress warns that anyone entering Russia will face the same fate as Ukrainians in Kursk.
Putin’s… pic.twitter.com/TqJaVFLjJk
— Manish Jha (@ManishJhaTweets) March 13, 2025