Vinod Bajaj | లండన్: పంజాబ్‌లో పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్‌లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. నడకలో ఇప్పటికే ఓసారి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన.. తాజాగా 1,114 రోజుల్లో ఒంటరిగా 80 వేల కిలోమీటర్లకుపైగా నడిచి తన రికార్డును తానే అధిగమించాడు.
ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం. గత వారం ఈ ఫీట్‌ను పూర్తిచేసిన వినోద్ బజాజ్.. దీన్ని ‘డబుల్ ఎర్త్ వాక్’గా అభివర్ణించారు. ఈ ఫీట్‌ను గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయించేందుకు దరఖాస్తు చేశారు. 2020 సెప్టెంబర్‌లో ఫస్ట్ ఎర్త్ వాక్‌ను 1,496 రోజుల్లో వినోద్ బజాజ్ పూర్తిచేశారు.