జకార్తా : ఇండొనేషియా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. పార్లమెంటు సభ్యులకు హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరసనకారులు ఆర్థిక మంత్రి ఇంట్లోకి చొరబడి దోచుకున్నారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక సమస్యలపై ప్రజల అసంతృప్తిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవడంతో దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.