ఢాకా: పేరుగాంచిన రోహింగ్యా నేత మొహిబుల్లాను కాల్చి చంపారు. బంగ్లాదేశ్‌లో కోక్స్ బజార్లో ఉన్న శరణార్థుల క్యాంపులో ఆయన్ను హతమార్చారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కుటుపలాంగ్లో ఉన్న ఆఫీసు రూమ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మొహిబుల్లాను చంపేశారు. అతని వయసు 46 ఏళ్లు. అరకాన్ రోహింగ్యా సొసైటీ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్ సంస్థకు చైర్మన్‌గా ఉన్నాడు. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ ఏరియాలో సుమారు పది లక్షల మంది శరణార్థులు జీవిస్తున్నారు. అయితే రోహింగ్యాల తరలింపులో అతను కీలక పాత్ర పోషించాడు. మయన్మార్ మిలిటరీకి వ్యతిరేకంగా రోహింగ్యాల తరపున మొహిబుల్లా పోరాడాడు.