Joe Biden | వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి త్వరలో దిగిపోనున్న జో బైడెన్.. తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల్లో హంటర్ దోషి అని ఈ ఏడాది ప్రారంభంలో నిర్ధారణ అయింది. ఆయన కాలిఫోర్నియాలోని డెలాన్లో త్వరలో హాజరుకావలసి ఉంది. ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విచారణ ప్రక్రియలో రాజకీయాలు జరిగాయని జో బైడెన్ పేర్కొన్నారు. కాగా, బైడెన్ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. ఇది న్యాయవిరుద్ధమని అన్నారు.