జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా(South Africa)లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఆ దేశ పార్లమెంట్‌తో పాటు 9 రాష్ట్రాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. దేశంలోని తొమ్మిది ప్రావిన్సులకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు కొత్త పార్లమెంట్‌కు అవసరమైన కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. శ్వేతజాతీయుల నుంచి స్వాతంత్య్రాన్ని పొందిన తర్వాత .. దక్షిణా ఆఫ్రికా ఏఎన్సీ ఆధీనంలోనే ఉన్నది. అయితే తాజా ఎన్నికల్లో ఏఎన్సీ మెజారిటీ కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 27 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో 70 పార్టీలు, 11 ఇండిపెండెంట్లు జాతీయ, ప్రావిన్సు ఎన్నికల్లో పోటీలో ఉన్నాయి.