సియాటెల్ : అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు.
ఈ ఘటనపై విచారించిన సియాల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ సంబంధిత పోలీస్ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని సెలవుపై పంపించాలని సిఫార్సు చేసింది.