మనం మనస్సు లగ్నం చేస్తే ఏదైనా సాధించొచ్చని డాక్టర్ ఎమ్మెట్ బ్రౌన్ చెప్పిన మం చి కొటేషన్. ఇది అందరూ తమ జీవితానికి అన్వయించుకోవచ్చు. యూఎస్‌లో ఓ కారుకింద ప్రమాదవశాత్తూ ఓ బైకర్ పడిపోగా, పోలీసులు కారును అమాంతం పైకి లేపారు. ఆ బైకర్ ప్రాణాలు కాపాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూఎస్ఏలోని సౌత్ కరోలినాలో ఇద్దరు ద్విచక్రవాహనం వెళ్తుండగా, వెనుకనుంచి కారు ఢీకొట్టింది. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎగిరి కొంతదూరంలో పడగా, వెనుకున్న వ్యక్తి కారుకింద చిక్కుకుపోయాడు. అక్కడే స్థానికులు పెద్దసంఖ్యలో గుమిగూడారు. పోలీసులు పరుగునవచ్చి స్థానికుల సహాయంతో కారును సినిమాటిక్ స్టైల్లో పైకి లేపారు. ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా, 16గంటల్లోనే మిలియన్ మంది వీక్షించారు.