లాహోర్: రెండు రోజులుగా రణరంగాన్ని తలపించిన జమాన్ పార్క్(Zaman Park) ఇప్పుడు ఫ్రీ అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు వెనక్కి తగ్గారు. నిన్నటి నుంచి పీటీఐ(PTI) కార్యకర్తలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 54 మంది రేంజర్లు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి ఇమ్రాన్‌ను అరెస్టు చేయలేకపోయిన పోలీసులు.. ఇవాళ ఉదయం మళ్లీ భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇవాళ కూడా పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని తరిమికొట్టారు. పోలీసులు నిష్క్రమించిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ గ్యాస్ మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చి కార్యకర్తలతో ముచ్చటించారు.
شدید شیلنگ کے باوجود عمران خان زمان پارک کارکنوں کے درمیان موجود#زمان_پارک_پُہنچو pic.twitter.com/hNRWTdKUTi
— PTI (@PTIofficial) March 15, 2023
ఇవాళ ఉదయం నుంచి పలు మార్లు ఇమ్రాన్ తన పార్టీ ట్విట్టర్లో కొన్ని పోస్టు పెట్టారు. భారీ సంఖ్యలో పోలీసులు తన ఇంటిపై సంధించిన టియర్ గ్యాస్ షెల్స్(tear gas shells)ను ఆయన చూపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ప్రజెంట్ చేశారు. తోషాఖానా(toshakhana) కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఈనెల 18వ తేదీ వరకు తన వద్ద ప్రొటెక్షన్ బెయిల్ ఉన్నట్లు చెప్పారు. తనను ఎత్తుకెళ్లి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్ ఇళ్లు జమాన్ పార్క్ నుంచి రేంజర్లను తరిమివేసిన కార్యకర్తలు సంబరాల్లో తేలిపోయారు.
کل سہ پہر سے میرا گھر شدید حملے کی زد میں ہے۔ رینجرز کی تازہ ترین یلغار ملک کی سب سے بڑی سیاسی جماعت کو فوج کے مدِّمقابل کھڑا کررہی ہے۔ پی ڈی ایم اور پاکستان کے دشمن یہی تو چاہتے ہیں۔ مشرقی پاکستان کے المیے سے کوئی سبق نہیں سیکھا گیا۔ pic.twitter.com/SqP5cAkfJQ
— Imran Khan (@ImranKhanPTI) March 15, 2023