PM Modi | వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజ్యూర్లతో కలిసి వచ్చారు. మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.
దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి మస్క్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మస్క్-మోదీ చర్చల్లో ముఖ్యంగా స్టార్‌లింక్ పెండింగ్ లైసెన్స్ గురించి ప్రస్తావిస్తారని తెలుస్తున్నది.
ఇదిలావుండగా, మోదీతో భేటీకి కొద్ది గంటల ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీకార సుంకాలపై గురువారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై సంతకం చేస్తానని తెలిపారు.