ది హేగ్: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాలతో అక్కడి రాయల్ ప్యాలెస్‌లో సమావేశం అయ్యారు. డిజిటల్ టెక్నాలజీ, ఫిన్‌టెక్, బ్లూ ఎకానమీ తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై వారు చర్చించారు.
‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ప్రపంచాన్ని నిర్మించాలనే ఉమ్మడి విశ్వాసం, ఉమ్మడి ఆసక్తులతో భారత్, నెదర్లాండ్స్ అనుసంధానమై ఉన్నాయి’ అని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు రాజధాని హేగ్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ మాట్లాడారు.