బారి (ఇటలీ), జూన్ 15: ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు శనివారంతో విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిగినట్టు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఉన్న నిబద్ధత చైనాకు స్పష్టమైన సంకేతంగా ఆమె అభివర్ణించారు. తాము ఏ విషయంలోనైనా బహిరంగ చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అందులో భాగంగానే భారత్తో ఆమె శుక్రవారం చర్చలు జరిపారు.