జకర్తా: ప్రధాని మోదీ(PM Modi)కి అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియా ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. బిన్టాంగ్ ఆదిపూర్ణ(Bintang Adipurna) అవార్డుతో మోదీని సన్మానించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆ మెడల్‌ను అందజేశారు. ప్రస్తుతం మోదీ ఇండోనేషియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రేమతో ఇండోనేషియాకు తనకు అత్యున్నత పురస్కారాన్ని అందజేసినట్లు పీఎంవో కార్యాలయం తన ట్వీట్లో తెలిపింది. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు చెందుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ సత్కారం ఇండోనేషియా ప్రజల భావోద్వేగాలకు చెందుతుందని తెలిపారు. భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు మోదీ పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులను ఇండోనేషియా సర్కారు బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో సత్కరిస్తుంది.
Heartiest congratulations to PM @NarendraModi ji on being conferred Indonesia’s highest honour, the ‘Bintang Adipurna of the Republic of Indonesia’.
This honour is a fitting testament to his dynamic global leadership and the deepening bonds of friendship between India and… pic.twitter.com/eAoepvM4Se
— Piyush Goyal (@PiyushGoyal) July 7, 2026