PM Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం అమెరికాకు చేరుకున్నారు. వ్యూహాత్మక క్వాడ్ సదస్సుతోపాటు పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై సమావేశంతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం అవుతుంది. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
‘ఫిలాదెల్పియాకు చేరుకున్నాను. ఈ రోజు క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనడం, పోటస్ వద్ద జోబైడెన్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కరానికి, యావత్ సమాజం మెరుగు పడేందుకు నా చర్చలు దోహద పడతాయని భావిస్తున్నా’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తనకు స్వాగతం పలికిన భారత సంతతి అమెరికన్లతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బానీస్, జపాన్ ప్రధాని ఫుమియో ఖిషిడలతో జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. క్వాడ్, ఆసియా-ఫసిపిక్ ప్రాంతంపై చైనా ప్రభావంపై ఈ క్వాడ్ సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతుందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.