PM Modi : ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య, రక్షణ సహా అనేక అంశాలపై చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నెదర్లాండ్స్‌లో ఉన్న భారతీయ చారిత్రక వస్తువుల్ని ఇండియాకు తిరిగి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకిరించింది.
11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి పలకల్ని తిరిగి ఇచ్చేందుకు నెదర్లాండ్స్ అంగీకరించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా వివరాలు తెలిపారు. ఇది భారతీయులకు ఎంతో సంతోషకరమైన విషయం అని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘11వ శతాబ్దం నాటి చోళుల పలకల్ని నెదర్లాండ్స్.. ఇండియాకు తిరిగి ఇచ్చేయబోతుంది. దీనికి సంబంధించిన అప్పగింత ప్రక్రియలో నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో కలిసి పాల్గొన్నా. ఇందులో 21 పెద్ద పలకలు, 3 చిన్న పలకలు ఉన్నాయి. వాటిపై ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషల్లో ఒకటైన తమిళం ఉంది. ఇది రాజరాజ చోళుడి తనయుడు రాజేంద్ర చోళ కాలం నాటిది.
A joyous moment for every Indian!
Chola Copper Plates dating back to the 11th Century will be repatriated to India from the Netherlands. Took part in the ceremony for the same in the presence of Prime Minister Rob Jetten.
The Chola Copper Plates are a set of 21 large plates… pic.twitter.com/Zwu0QFc2ZJ
— Narendra Modi (@narendramodi) May 16, 2026
చోళుల గొప్పదనానికి ఇది నిదర్శనం. భారతీయలు చోళుల పాలన, సంస్కృతి గురించి గర్వపడుతుంటారు. ఈ పలకల్ని అప్పగించిన నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, 19వ శతాబ్దం నుంచి వీటిని రక్షిస్తున్న లీడెన్ యూనివర్సిటీకి ధన్యవాదాలు” అంటూ మోదీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని కూడా మోదీ షేర్ చేశారు.