అక్రా (ఘనా): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా దేశ పార్లమెంటులో ప్రసంగించారు. భారత దేశంలో 2,500కుపైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన చెప్పేసరికి పార్లమెంటేరియన్లు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు. దీంతో మోదీ కాసేపు తన మాటలను ఆపారు.
అనంతరం మాట్లాడుతూ, “నేను మళ్లీ చెప్తున్నాను, 2,500 రాజకీయ పార్టీలు” అన్నారు. ఈసారి పార్లమెంటేరియన్లు మరింత బిగ్గరగా స్పందించారు.