కాలిస్పెల్: అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.
నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం అప్పటికే ఆగి ఉన్న ప్రయాణికులు లేని విమానాన్ని ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి ఎయిర్‌పోర్టులోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. ఆ విమానాన్ని 2011లో తయారు చేశారని పేర్కొన్నారు.
🚨🛬Small plane crashes at Kalispell City Airport
Initial reports indicate a small plane had an issue on the runway and crashed into another plane on the taxiway.Flathead County Sheriff Brian Heino tells MTN that the extent of any injuries is not known at this time.#Montana… pic.twitter.com/JaLCQlBcdp
— Chat News Hub (@chatnewshub) August 11, 2025