బీజింగ్, మార్చి 21: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం మధ్యాహ్నం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిపోవడంతో అడవికి పెద్దయెత్తున మంటలు అంటుకొన్నాయి. భూమికి 26 వేల అడుగుల ఎత్తు పైనుంచి సరాసరిగా విమానం నేలపై కూలిపోయినట్టు ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్ ‘ఫ్లైట్రాడార్24’ వెల్లడించింది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇది జరిగినట్టు వివరించింది. విమానం కిందపడిపోతున్న దృశ్యాలు, ఘటనాస్థలిలో చెలరేగిన మంటల వీడియోలు వైరల్‌గా మారాయి.