డెన్వర్, మార్చి 14: అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి డల్లాస్ వెళుతున్న ఓ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో గురువారం చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు సిబ్బందితో సహా విమానంలో 178 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి డెన్వర్ విమానాశ్రయానికి మళ్లించినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో మంటలు చెలరేగడంతో రెక్కల పైనుంచి ప్రయాణికులను బయటకు తరలించారు. ల్యాండింగ్ అయిన తర్వాత గేట్ వైపు వెళుతుండగా విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్టు వార్తలు వెలువడ్డాయి. విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని, అయితే స్వల్పంగా గాయపడిన 12 మందిని దవాఖానకు తరలించామని డెన్వర్ విమానాశ్రయం ఎక్స్‌లో వివరించింది.