వాషింగ్టన్: పైలట్ లేకుండానే అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలీకాప్టర్ ఇటీవల గాల్లో చక్కర్లు కొట్టింది. కంప్యూటర్ సాయంతో 30 నిమిషాల పాటు ఎలాంటి అవాంతరం లేకుండా ఎగిరిన ఈ స్వయంచాలిత హెలీకాప్టర్.. తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 180-200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు తెలిపారు. యుద్ధ సమయాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడంలో ఇవి సాయపడుతాయన్నారు.