న్యూయార్క్ : న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్‌ను ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ చనిపోయారని.. పలువురికి గాయాలయ్యాయని ఎన్బీసీ న్యూస్ తెలిపింది.
ప్రమాదం కారణంగా ట్రక్‌లోని పోలీసులు గాయపడ్డారని.. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగా ఉందని వెల్లడించింది. మాంట్రియల్‌కు వెళుతున్న ఈ విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు తెలిసింది.