కూలిన ఆరంతస్తుల భవనం… శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలు
బీజింగ్: చైనాలో ఆరంతస్తుల భవనం కూలింది. దీంతో శిథిలాల్లో పలువురు ప్రజలు చిక్కుకున్నారు. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వ్యాపార సముదాయాలున్న ఆరు అంతస్తుల భవనం కూలింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ బిల్డింగ్‌లో ఒక రెస్టారెంట్, సినిమా థియేటర్, సీసీటీవీ న్యూస్ ఛానల్ కార్యాలయం, ఒక అతిథి గృహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని తెలుస్తున్నది. కాగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, చైనాలో సాధారణంగా బిల్డింగులు కూలవు. అయితే అవినీతి, సరైన ప్రమాణాలు పాటించకపోవడం వంటి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఆరంతస్తుల భవనం కూలిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A six-floor building collapsed on Friday noon in #Changsha, the capital city of #China’s #Hunan Province. Rescue work is underway after the collapse. pic.twitter.com/dCvD2FcXWE
— Ifeng News (@IFENG__official) April 29, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

