పెగాసస్ వంటి టెక్నాలజీ వల్లే ప్రశాంతంగా నిద్రపోతున్నారు!

తమ సాఫ్ట్‌వేర్‌ను సమర్థించుకున్న ఎన్ఎస్వో
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, దానిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో మాత్రం తమ సాఫ్ట్‌వేర్‌ను సమర్థించుకున్నది. ఇలాంటి సాంకేతికత వల్లే కోట్లాది మంది ప్రజలు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, వీధుల్లో ధైర్యంగా నడవగలుగుతున్నారని పేర్కొన్నది. నేరాలు, ఉగ్రవాదంతోపాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్ మాటున దాక్కుని అక్రమంగా చైల్డ్ పోర్నోగ్రపీకి పాల్పడుతున్న ముఠాలను కట్టడిచేసేందుకు, విచారించేందుకు పెగాసస్ వంటి సాఫ్ట్వేర్లు దర్యాప్తు సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించింది. ఈ టెక్నాలజీని తాము ఆపరేట్ చేయబోమని, అలాగే తమ క్లయింట్లు సేకరించే డాటా కూడా తమకు అందుబాటులో ఉండదని స్పష్టంచేసింది. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు తాము సాధ్యమైనదంతా చేస్తున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను భారత్‌కు విక్రయించారా అన్న ప్రశ్నకు ఆ అధికారి సూటిగా సమాధానమివ్వలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- NSO
- Pegasus Spyware
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

