ఫ్లోరిడా: అమెరికాలో గాల్లో పరుగులు తీస్తున్న ఓ ఫ్లైట్ ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా 5 వేల అడుగుల కిందకు జారిపోయింది. ఈ సందర్భంగా ఫ్లైట్ భారీ కుదుపులకు లోనయ్యింది. ఈ కుదుపులవల్ల ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందికి, ప్రయాణికులకు గాయాలయ్యాయి. విమానం అలా ఒక్కసారిగా కిందకు జారడానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నార్త్‌కరోలినా నుంచి ఫ్లోరిడాకు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవుతూ కిందకు జారిపోతుంటే సిబ్బందిలో ఒకరు గాల్లోకి ఎగిరి ఫ్లోర్‌పై గట్టిగా పడ్డాడు. ఈ ఘటనలో అతని కాలి మడమకు తీవ్ర గాయమైంది. అదేవిధంగా వాష్‌రూమ్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడు రక్తంతో కూడిన గాయాలతో బయటికి వచ్చాడు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు సహా మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. విమానం ఫ్లోరిడాలో ల్యాండ్ అయిన వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.