దుబాయ్, డిసెంబర్ 13: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల నుంచి ధ్రువ పత్రాల జారీ దాకా దుబాయ్లో ఇక నుంచి అన్ని కార్యకలాపాలు పేపర్ వాడకుండానే జరుగనున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు పేపర్ వాడకాన్ని దుబాయ్ పూర్తిగా నిషేధించింది. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక ‘పేపర్లెస్ గవర్నమెంట్’గా రికార్డు సృష్టించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా రూ.2,649 కోట్లు ఆదా అవుతుందని దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ అల్ మక్తూమ్ ప్రకటించారు.