Pak | అంతర్జాతీయంగా మరోసారి పాకిస్తాన్ పరువు పోయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసేందుకు ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒంటరిగా కూర్చొని గోళ్లు గిల్లుకోవడం కనిపించింది. దాదాపు 40 నిమిషాల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ సమావేశంలో పాల్గొనేందుకు షాబాజ్ షరీఫ్ తుర్కమేనిస్తాన్ అష్గాబాత్‌కు వచ్చారు. ఇదే సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం వచ్చారు. ఈ సందర్భంగా పుతిన్‌తో సమావేశానికి పాక్ ప్రధాని ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల సమావేశానికి షెడ్యూల్‌ను నిర్ణయించారు.
❗️The Moment PM Sharif Gate-crashed Putin’s Meeting With Erdogan After Waiting For 40 Mins https://t.co/r4L9XhA9IY pic.twitter.com/shi7YLMgmP
— RT_India (@RT_India_news) December 12, 2025
ఈ మేరకు సమావేశం హాలు వద్దకు షాబాజ్ చేరుకోగా.. సహాయకులు పాక్ ప్రధానిని అడ్డుకున్నారు. షాబాజ్ వారిని పట్టించుకోకుండా బలవంతంగా లోపలికి వెళ్లిపోయారు. పుతిన్ కోసం దాదాపు 40 నిమిషాలు నిరీక్షించారు. సమావేశం హాలులో షాబాజ్ ఒక్కడే కూర్చొని గోళ్లు కొరుక్కుంటూ కనిపించాడు. దాదాపు 40 నిమిషాల తర్వాత పాక్ ప్రధానిని పుతిన్ కలిశారు. అయితే, పుతిన్ అదే సమయంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో సమావేశమయ్యారు. తుర్కమేనిస్తాన్ నేతతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించిన పుతిన్.. పాక్ ప్రధానితో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. పాక్ ప్రధానిని పుతిన్ పెద్దగా పట్టించుకోకపోవడం ఇదే తొలిసారేం కాదు. సెప్టెంబర్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలోనూ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వెంట పడుతూ కనిపించారు.
❗️🇵🇰 PM Sharif Waited For Over 40 Minutes For President Putin Before Growing Tired And Gate-crashing Russian Leader’s Meeting With Erdogan – RT Correspondent
He left ten minutes later. pic.twitter.com/tgUdPHT4eh
— RT_India (@RT_India_news) December 12, 2025