ఇస్లామాబాద్, ఏప్రిల్ 20: పాకిస్థాన్‌లో ఓ హిందూ మంత్రిపై కొంతమంది టమోటోలు, ఆలుగడ్డలతో దాడికి పాల్పడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి కాలువ నిర్మాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులు, హిందూ నేత ఖియాల్ దాస్ కోహిస్తానీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడినట్టు తెలిసింది. దాడి ఘటనను ప్రధాని షెహబాజ్, సింధ్ ప్రావిన్స్ సీఎం సహా పలువురు నేతలు ఖండించారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని ప్రకటించారు. కోహిస్తానీ పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ సభ్యుడు, ప్రస్తుత షెహబాజ్ సర్కార్‌లో మత వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.