Pakistan | పాకిస్తాన్లో చమురు సంక్షోభం.. రాత్రి 9 తర్వాత గ్యాస్ సరఫరా బంద్
Pakistan : పాకిస్తాన్లో చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దేశంలో అవసరాలకు సరిపడా చమురు లభించడం లేదు. దీంతో గ్యాస్ వినియోగంపై కఠిన నిర్ణయాల్ని అమలు చేస్తోంది పాక్ ప్రభుత్వం.
Pakistan : పాకిస్తాన్లో చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దేశంలో అవసరాలకు సరిపడా చమురు లభించడం లేదు. దీంతో గ్యాస్ వినియోగంపై కఠిన నిర్ణయాల్ని అమలు చేస్తోంది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన కరాచీలో రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది.
అక్కడ ప్రభుత్వమే ఇండ్లకు ఎల్ఎన్జీని సరఫరా చేస్తోంది. గతంలో నిరంతరం గ్యాస్ సరఫరా జరిగేది. కానీ, ప్రస్తుతం రోజూ పరిమితంగా మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొద్దిసేపు మాత్రమే గ్యాస్ అందిస్తోంది. దీంతో చాలా మంది గ్యాస్ సరఫరా కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సరఫరా జరిగినప్పుడే వంటలు చేసుకుంటున్నారు. ఇక, రాత్రి 9 తర్వాత గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రాత్రి 9 తర్వాత వంట చేసుకునేందుకు అవకాశం లేదు. ఈ లోపే వంట చేసుకుని తినాల్సి వస్తోంది. గ్యాస్ అందుబాటులో ఉన్న సమయంలోనే వంట పూర్తి చేసుకునేందుకు అక్కడి మహిళలు తంటాలు పడుతున్నారు.
త్వరగా వంట చేసుకుని తినకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం టీ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి గృహిణులు చెబుతున్నారు. గ్యాస్ సరఫరాకు అనుగుణంగా తమ షెడ్యూల్స్ మార్చుకోవడం అక్కడి వారికి కష్టంగా మారింది. భోజన వేళలు కూడా గ్యాస్ సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగితే, పాకిస్తాన్లో మరింత చమురు సంక్షోభం తప్పదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- fuel crisis
- Karachi
- LNG
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

