Suspected Terrorists: పాకిస్థాన్‌లో 17 మంది అనుమానిత ఉగ్రవాదులు హతం..
Suspected Terrorists: క్వెట్టాలో ఓ రైలుపై కారు బాంబుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ దేశ భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. బలోచిస్తాన్ ప్రావిన్సులోని వివిధ జిల్లాల్లో సుమారు 17 మంది అనుమానిత ఉగ్రవాదులు హతం అయ్యారు.
కరాచీ: పాకిస్థాన్‌లో వారం క్రితం క్వెట్టా సిటీలో ఓ ప్రయాణికుల రైలుపై కారు బాంబుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ఆ దేశ భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. బలోచిస్తాన్ ప్రావిన్సులోని వివిధ జిల్లాల్లో సెక్యూర్టీ దళాలు నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు 17 మంది అనుమానిత ఉగ్రవాదులు(Suspected Terrorists) హతం అయ్యారు. మే 24వ తేదీన క్వెట్టా సమీపంలో ఓ షటిల్ రైల్పై ఆత్మాహుతి దాడి జరిగిన ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. కారు బాంబుతో రైలుపై అటాక్ చేశారు.
పాకిస్థాన్ మిలిటరీకి చెందిన ఇంటెలిజెన్స్ శాఖ బలోచిస్తాన్లో ఆపరేషన్ చేపట్టింది. ఐఎస్పీఆర్ ప్రకారం 17 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాద రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు. మస్తుంగ్, నౌషికి, జెహ్రీ, కుజ్దార్, కెచ్ ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.ఫిత్నా అల్ హిందుస్తాన్ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ వెల్లడించింది. ఉగ్ర స్థావరం నుంచి ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్ధాలు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

