కాబుల్: పాకిస్థాన్ సోమవారం అర్ధరాత్రి తమ దేశంపై వైమానిక దాడులు చేయడంతో పది మంది పౌరులు మరణించారని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ‘పాక్ దళాలు నివాసాలపై బాంబులేశాయి. దాని వల్ల తొమ్మిది మంది పిల్లలతో పాటు ఒక మహిళ దుర్మరణం చెందారు. ఈ దాడిపై సరైన సమయంలో స్పందిస్తాం’ అని ఖోస్ట్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.