న్యూఢిల్లీ : పాకిస్థాన్లో ప్రత్యేక సింధూ దేశ్ ఉద్యమం ఉధృతంగా మారుతున్నది. కరాచీలో గత ఆదివారం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు విధ్వంసానికి దిగుతున్నారు.
సింధీ సంస్కృతి దినోత్సవం సందర్భంగా ఆదివారం సింధూ దేశ్ ఉద్యమం ప్రారంభమైంది. ‘జియే సింధ్ ముత్తాహిదా మహజ్’ సంస్థ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు ‘మాకు స్వాతంత్య్రం కావాలి’, ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తాజా ఆందోళనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.