Donald Trump | కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రతిపాదనను పాకిస్థాన్ (Pakistan) స్వాగతించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందిస్తూ.. కశ్మీర్ సమస్య (Kashmir issue) కోసం ఇరు దేశాలతో కలిసి కృషి చేస్తానని వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితులను ఇరుదేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాయన్నారు. దాడులు పౌరుల మరణాలు, వినాశనానికి దారి తీస్తాయన్నారు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా సహాయపడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, కశ్మీర్ విషయలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రతిపాదనను పాక్ తాజాగా స్వాగతించింది.
Also Read..
BrahMos missile | బ్రహ్మోస్ శక్తి గురించి పాకిస్థాన్‌ను అడగండి : యూపీ సీఎం యోగి
Rahul Gandhi | పార్లమెంట్ ప్రత్యేక సెషన్ నిర్వహించండి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
Indian Air Force | ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది.. వదంతులు నమ్మొద్దు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్