ఇస్లామాబాద్: పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమార్తె, ఎంపీ ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. (Pak President Daughter Convoy Attacked) శుక్రవారం కరాచీ నుంచి నవాబ్‌షాకు వెళ్తున్న ఆమె కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. సింధు నదిపై నిర్మిస్తున్న వివాదాస్పద ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై పాకిస్థాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆసిఫా భుట్టో కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పలు వాహనాలపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు.
కాగా, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ఆసిఫా భుట్టో వాహనాన్ని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి పంపారు. ఈ దాడిలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు పాక్ అధ్యక్షుడి కుమార్తె కాన్వాయ్‌పై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The people protesting against water canals in Sindh attacked convoy of Zardari’s daughter, @AseefaBZ, with sticks and stones. Zardari approved the water canal projects against the people’s wishes. Aseefa was selected as an MPA by the military after stealing elections. #Pakistani pic.twitter.com/6oq1AjcxTk
— Samawar_Chai (@SamawarC) May 24, 2025