Pakistan First Lady | పాకిస్థాన్ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..!
Pakistan First Lady | పాకిస్థాన్ నూతన అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రథమ మహిళ (Pakistan First Lady) స్థానాన్ని తన 31 ఏళ్ల కుమార్తె అసీఫా భుట్టో (Aseefa Bhutto)కు ఇవ్వాలని నిర్ణయించారు.
Pakistan First Lady | పాకిస్థాన్ నూతన అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రథమ మహిళ (Pakistan First Lady) స్థానాన్ని తన 31 ఏళ్ల కుమార్తె అసీఫా భుట్టో (Aseefa Bhutto)కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాక్ మీడియా వెల్లడించింది.
ప్రథమ మహిళ హోదా సాధారణంగా దేశ అధ్యక్షుడి భార్యకు వెళుతుంది. అయితే, జర్దారీకి భార్య లేదు. ఆయన భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో (Benazir Bhutto) 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉంటున్నారు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ప్రథమ మహిళ హోదాను ఖాళీగానే ఉంచారు. అయితే ఈ సారి మాత్రం ప్రథమ మహిళగా తన చిన్న కుమార్తె ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ జర్దారీ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా పేర్కొంది.
మీడియా కథనాల నేపథ్యంలో అసీఫాను ప్రథమ మహిళగా పేర్కొంటూ అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తవార్ భుట్టో జర్దారీ (Bakhtawar Bhutto Zardari) చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర్నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకూ జర్దారీకి అన్ని వేళలా పాక్ ప్రథమ మహిళ అసిఫా వెన్నంటే నిలిచింది అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాక్ ప్రథమ మహిళ హోదా అసీఫానే చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడి (14th president of Pakistan)గా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జర్దారీ విజయం సాధించారు. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ చేసిన ఆయన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75)ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జర్దారీకి 255 ఓట్లు, మహమూద్‌కు 119 ఓట్లు లభించాయి. దీంతో తదుపరి పాక్ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు చేపట్టారు. ఇస్లామాబాద్ (Islamabad)లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.
Also Read..
Pakistan | పాక్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ప్రమాణం
Train | రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి కాలర్ పట్టుకొని దుర్బాషలాడిన తల్లీకూతుళ్లు.. VIDEO
Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

