ఇస్లామాబాద్, ఆగస్టు 8: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్ ఎన్నికల సంఘం ఐదేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీపీ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది. తోషాఖానా అవినీతి కేసులో కోర్టు ఇమ్రాన్ఖానును దోషిగా తేల్చి, మూడేండ్ల శిక్ష విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొన్నది.